5, సెప్టెంబర్ 2017, మంగళవారం

నచికేతుడు -1


1. మహర్షి వాజవశ్రుని
సుతుడగు నచికేతుని
గూర్చి ఒక్క చక్కని
కథ వినరండి

2. యజ్ఞదీక్షితుడైన
తండ్రికి ఘాటైన
ప్రశ్నను చురుకైన
కొడుకు వేసినాడు

3. దాన మంటున్నావు
వట్టిపోయిన ఆవు
లెందు కిస్తున్నావు
తప్పెంచకుండ

4. ఈ రీతి ప్రశ్నించ
తండ్రి యుపేక్షించ
అవేశ మగ్గించ
ప్రశ్నించె కొడుకు

5. ఉన్నవన్నీ‌ నీవు
దాన మిస్తున్నావు
నన్నెవరి కిస్తావు
దయచేసి చెప్పు

6. మూడు మారు లిట్లని
తనయు డడిగి నాడని
కోపగించి యాముని
నోరు జారెను

7. ధర్మవ్యగ్రా విను
ధర్మదేవునకు నిను
దానముగ నిచ్చెదను
నీవు పోవచ్చును

8. విని కొడు కిటు పలికెను
కాను మొదటి వాడను
కాను చివరి వాడను
భయమేల పోదును

9. కొంచె మెంచి చూడుము
యమున కేమి లాభము
వీడుమా విచారము
భయమేల పోదును

10. దేహధారు లందరు
వచ్చిపోవు చుందురు
విదు లిందుకు కుందరు
ధీరచిత్తు లగుచు


4 కామెంట్‌లు:

  1. ఇది మధ్యలో ఆపకుండా
    రాస్తారేమో ఈ సారైనా
    మాలాంటి వాళ్ళని నీరుకార్పించకుండా
    లేదేమీ ఇందులో "ఓ కూనలమ్మా"

    మొత్తానికి మీరెవరో
    ముందే తెలిసింది
    దీనితో ఇంకా బాగా తెల్సింది
    ఓ కూనలమ్మా!

    రిప్లయితొలగించండి
  2. ఆపను లెండి. మరొక రెండు మూడు టపాలు దీనిపైన సిధ్ధంగా ఉన్నాయి కూడా. ఐతే ఇది కొంచెం‌ పెద్దగానే వస్తుంది. అంతలావు అంత్యప్రాసాక్రీడావ్యవహారనిమగ్నత నిజంగా దుష్కరమేను.

    ఆరుద్ర గారు ఆవిష్కరించిన ఈ ఛందస్సులో ఏవో కొన్ని విడివిడిపదాలుగా చేయటానికి బాగుంటుంది కాని ఏదన్నా ఒక కృతి వంటిది చేస్తే గాని నిగ్గు తేలదన్న అభిప్రాయం ఒకటి లోగడ వచ్చింది. చూదాం ఇది ఎంత పఠనీయంగా వస్తుందో‌ అన్నది.

    నేనెవరో తెలియటంలో పెద్ద చిక్కు ఏమీ ఉండకూడదు. అందుకని ముందే కొన్ని విడిగా వ్రాసిన తరువాతనే ఈ బ్లాగు కేవలం ఈ‌ ఛందస్సు మీద పనిచేయటానికి మొదలు పెట్టాను.

    మధ్యలో ఒకరి గోత్రస్ఖలనమూ, దాన్ని తమకు వీలుగా మలుచుకుందుకు మరొకరి తాపత్రయమూ చూసి చిరాకు పడి చిటపటలాడటమూ అనుకోకుండా జరిగిపోయిన సంఘటనలు. ఎవరినీ‌ నొప్పించటం‌ నామతం కాకపోయినా అందరూ అలాంటి వ్రతం పూనాలని ఏమీ‌లేదుగా. నేను మరికొంత శాంతంగా ఉండవలసింది అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి

  3. శాంతము లేక సౌఖ్యము లేదోయ్ !

    ఆల్ ది బెస్ట్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. కొందరి చర్యల వలన కొద్దోగొప్పో అశాంతి కలుగుతున్నా, మొత్తం మీద శాంతంగానే ఉన్నా నండీ.

    రిప్లయితొలగించండి

ఏ మంటారూ?