1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

నీ దారి నీదిగా సాగు నిర్భీతిగా ఓ కూనలమ్మా


అందాల కందాలు
చెడగొట్టు చందాలు
జిలేబీ గిందాలు
ఓ కూనలమ్మా

హాస్యాలతో‌ తప్పు
కప్పి ఒప్పని చెప్పు
జిలేబీతో ముప్పు
ఓ కూనలమ్మా

జిలేబీతో చర్చ
చేయుటే ఒకపిచ్చ
ఎందుకొచ్చిన రచ్చ
ఓ‌ కూనలమ్మా

అలవాటు ఒకరిదా
పొరపాటు ఒకరిదా
గ్రహపాటు ఒకరిదా
ఓ కూనలమ్మా

నీ‌ మాట నీదిగా
నీ దారి నీదిగా
సాగు నిర్భీతిగా
ఓ కూనలమ్మా

1 కామెంట్‌:



  1. దారిన నీవు జిలే
    బీ దండిగ పద్యములను భీకరముగనన్
    రాదారిన బోవు జనుల
    భేతాళమ్మ వలె పట్టి పీడించు సుమా :)

    జిలేబి

    రిప్లయితొలగించండి

ఏ మంటారూ?