2, సెప్టెంబర్ 2017, శనివారం

హద్దుమీరిన తెంపరితనం - తప్పు సవరించుకో నొల్లని డాంబికం.


పాఠకులారా,  వరూధిని బ్లాగులో, జిలేబీ గారు వ్రాసుకొన్న ఈ గిద్యం కొద్ది సేపటి క్రిందట నా కళ్ళ బడింది మాలిక వ్యాఖ్యల పుటలో.

శ్రీ కూనలమ్మ కలమున్
తాగైకొని కవనవీర తారా పథమున్
జోగితిరుగుల జిలేబీ
మా గాయల వేయుచు కసమస వచ్చె గదా !

ఇదొక కందపద్యం‌ అనీ 'క' కు 'గ' తో‌ ప్రాసమైత్రి ఉందని జిలేబీ గారి ఛందోవివేకం. బాగుంది.

అందరికీ తెలిసిన సంగతే. జిలేబీగారి పద్యాల్లో అర్థం వెదకటం ఎండమావుల్లో నీళ్ళు వెదకటం కన్నా పెద్ద వ్యర్థక్రియ.  అందుచేత పై వ్రాతకు పూర్తి అన్వయం ఏమిటో ఆవిడకే తెలియాలి.

కాని ఇక్కడ కూనలమ్మకు అసహ్యం‌ కలిగించిన విషయం ఏమిటంటే 'కూనలమ్మ కలమున్ తాగైకొని ' అంటూ‌ జిలేబీ గారు డప్పువేసుకోవటం.

ఒక ముఖ్య విషయం. కూనలమ్మ అన్న పేరుతో ఈ కూనలమ్మ బ్లాగు నిర్వహిస్తున్నది జిలేబీ కాదన్నది ఇప్పటికే బ్లాగులు చదివేవారికి బాగానే తెలిసి ఉంటుందని నమ్ముతున్నాను.

సందేహం ఉన్న వారు కూనలమ్మ పద్యాలు కొన్ని వెలువడిన పిదపనే కూనలమ్మ బ్లాగు మెదలయిందన్న విషయం‌ గుర్తుకు తెచ్చుకుంటే, ఈ కూనలమ్మ ఎవరో‌ బోధపడుతుంది.

ఇప్పుడు, ఇకొంకరి డాంబికం గురించి కూడా వ్రాయక తప్పటం‌ లేదు.  గత నెల 30వ తారీఖున కూనలమ్మ అన్నసూక్తం‌ అన్న టపా ఒకటి ప్రచురించాను. అది నచ్చి అన్యగామి గారు 'జిలేబి గారు, మీ పద్యాల పదును పెరుగుతోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని బాగా చెప్పారు.' అంటూ ఒక వ్యాఖ్య పెట్టారు.  అన్యగామి గారు పొరబడ్డారు. ఆ సంగతిని వారే‌ త్వరలో గుర్తించ గలరని భావించి పట్టించుకోలేదు.  మరొక టపాలో‌ సూచనగా వారు పొరబడిన సంగతిని ప్రస్తావించాను.  కాని ఈనెల ఒకటవ తారీఖున 'పొరబడ్డారు. జిలేబీ వేరు, కూనలమ్మ వేరు.' అని స్పష్టంగా తెలియ జేయటం జరిగింది.

కాని ఇంతవరకూ అన్యగామి గారి వద్దనుండి ఒక్క ముక్క కూడా పొరపాటును సవరించుకొనే ప్రయత్నంగా రాలేదు. అలాగని వారు ఈ‌మధ్యకాలంలో బ్లాగుల్లో కనిపించలేదా అంటే అదేమీ‌ లేదు - కనిపిస్తునే ఉన్నారు. అంటే‌ దాని అర్థం వారికి పొరపాటును ఒప్పుకొనే హుందాతనం లేదనే కదా. ఒకవేళ అన్యగామి గారు ఆ టపా వ్రాసినది జిలేబీ కాదని తెలిస్తే మెచ్చుకోలు తెలిపేవారు కాదేమో. అనవసరంగా మెచ్చుకున్నానే అనుకుంటున్నారేమో‌ తెలియదు. అందుకనే మౌనంగా ఉండిపోయారేమో తెలియదు.

ఒక అవకాశం దొరికింది కదా అని,  ఈ‌ ప్రక్కన జిలేబీ‌గారు అక్షరాలా కూనలమ్మ పేరును కబ్జా చేసేందుకు నానా గోలా చేస్తున్నారు.  పైగా కూనలమ్మ బ్లాగు లోనే మరొక వ్యాఖ్యలో  జిలేబీ గారు 'కూ సింతై న సిగ్గు వలయున్ గదుటే ' అంటూ‌ కూనలమ్మ నే గద్దించారు!

ఇదంతా చాలా అసహ్యం కలిగిస్తోంది. దాని మాటల్లోనికి తేవటమూ‌ కష్టమే అనిపిస్తోంది. పాఠకులు అర్థం చేసుకోవలసినదే.

జిలేబీ లాంటి తెంపరులను శిక్షించటం ఎలాగూ‌ అన్నది అటుంచి ఉచితానుచితాలను ఉద్దేశపూర్వకంగా విసర్జించిన వారినుండి తమతమ బ్లాగుల యొక్క హుందాతనాన్ని కాపాడుకోవటం ఎట్లాగూ‌ అన్నది ముఖ్యమైన ప్రశ్న.

ఇకపై ఎంపిక చేసిన వ్యాఖ్యలనే ఈ  కూనలమ్మ బ్లాగు లో  ప్రచురించటం జరుగుతుంది. నియంత్రణ లేదు కదా అని కాలక్షేపరాయుళ్ళూ, కాకిగోల జిలేబీలూ, అనామకులూ ఇకపై ఇక్కడ గిలకటం కుదరదు. ఈ నిర్ణయం‌ వెంటనే అమలులోనికి వస్తున్నది.

ఇక్కడ గిలకటం కుదరని వాళ్ళెవరైనా ఎక్కడెక్కడో ఎదోదో‌ గొణుక్కుంటే కూనలమ్మ పట్టించుకోదు. అంత తీరికా ఓపికా కూనలమ్మకు లేవు.

పాఠకులు సహకరించ ప్రార్థన.

9 కామెంట్‌లు:

  1. అహ్హా, మీరెవరో నాకు తెలిసిపోయింది (అనుకుంటున్నాను) కూనలమ్మ గారూ 🙂.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బోలెడు సూచనలు ఇచ్చాను కదా ఈ‌బ్లాగు మొదలుపెట్టక ముందే. గ్రహించినందుకు సంతోషమండీ.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. జిలేజీనే అని నేరుగానే టపాలో తెలుస్తోందే.
      శ్యామలీయం‌ ప్రసక్తి ఎక్కడొచ్చిందబ్భా?
      మరో సారి టపాను క్షుణ్ణంగా చదువుకో!

      తొలగించండి
  3. అప్పా జిలేబి ఏం చెప్పను నీ గొప్పా
    నీ నోరో పెంట కుప్పా
    నువ్వో డుబాకోర్, భటా చోర్
    ఓ కూసలమ్మా

    రిప్లయితొలగించండి
  4. అయ్యా/అమ్మ, మీరు జిలేబి ఒకటి కాదని తెలియజేసిన విషయం ఇప్పుడే చూసాను. తెలిసింది కాబట్టి ఇక ఆ మాట తీసుకురాను. అన్నిసార్లు ప్రతివాఖ్యలు చూసుకొనే వీలు లేదు అని మీలాంటి వారికి తెలిసే ఉంటుంది. నా మాట మూలంగా మీకు బాధ కలిగిందని చింతిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు కూనలమ్మను వేరే పేరుతో పొరపాటునో/గ్రహపాటునో/కావాలనో పిలచినప్పుడు అభ్యంతరం రావటం జరిగింది. కాని మీరు పొరపాటు సరిచేసుకుందుకు ఇప్పటి వరకూ వీలుకాలేదంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మీరు ఇతరబ్లాగుల్లో దర్శనం ఇస్తూనే ఉంటూ వస్తున్నారు అప్పటినుండీ కాని బ్లాగులోకానికి దూరంగా ఏమీ లేరే. అదీ కాక కూనలమ్మ అభ్యంతరం తెలుపుతూ వేసిన వ్యాఖ్యలు మాలిక వ్యాఖ్యల పుటలో కూడా మీ దృష్టికి రాలేదని నమ్మలేకపోతున్నాను. పోనీయండి. ఈ విషయంపై చర్చ ఇంక అవసరం లేదు.

      తొలగించండి
  5. మీ రచన నచ్చినప్పుడు బావుంది అని చెప్పటానికి నేనేమి వెనుకాడను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంతోషం.

      ఒకరి రచన బాగుంది అని చెప్పటానికి ఎవరు కాని ఎందుకు వెనుకాడాలి? మీ ఉద్దేశం అస్పష్టంగా ఉంది.

      ఒకరి రచన బాగులేదు అని చెప్పటానికి ఎవరైనా కొంచెం ముఖమోటమి పడటాన్ని అర్థం చేసుకోవచ్చును.

      తొలగించండి

ఏ మంటారూ?