18, సెప్టెంబర్ 2017, సోమవారం

నచికేతుడు - 4



1. ఆనందము స్వల్పము
దుఃఖమే యధికము
మానవుల జీవితము
ఓ యమరాజా

2.  స్వర్గమని యున్నదట
 జరయనే దుండదట
మృత్యువచట లేదట
ఎంత గొప్పదో

3. స్వర్గమని యున్నదట
ఆకలియట లేదట
దప్పికయు లేదట
ఎంత గొప్పదో

4. స్వర్గమని యున్నదట
భయమనే దుండదట
పరమసుఖాస్పదమట
ఎంత గొప్పదో

5. అమృతత్వము నొసగెడు
స్వర్గదమై వెలిగెడు
అగ్నివిద్య నెఱుగును
సమవర్తి యందురు

6. శ్రధ్ధగ నా విద్యను
నీ వలన నేర్వగను
కేల్మోడ్చి కోరెదను
నా కిమ్మీ వరము

7. ఈ రెండవ వరమును
దయచేయ వేడెదను
ఆనందధామమును
పొందు విధమును

8. దయతో‌ నెఱిగింపవే
నా కనుగ్రహింపవే
సకలతత్త్వ విదుడవే
ఓ యమదేవా

9.  అడిగెను నచికేతుడు
శ్రధ్ధాళువు బాలుడు
సంత సించెను యముడు
తలయూచినాడు


5 కామెంట్‌లు:



  1. సమవర్తి యందు రట య
    గ్ని మహత్తును నేర్పుమయ్య కీనాశుడ! రా
    జ! మహిష వాహన యమనుడ !
    నమనము లివియే కృతాంత నచికేతుండన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబీ గారూ,

    ఇలా ఒక కందం కిట్టించటానికి తెగ ఆయాసపడే బదులు హయిగా మీరు వచనంలో చెబితే బాగుండేది కదా!

    రిప్లయితొలగించండి
  3. ఆహా! జిలేబీ మాతా! మీకు మరొక్క బిరుదు, ‘ఆయాస కందపద్యేశ్వరి’.......

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సునాయాస లేక అనాయాస కంద పద్యేశ్వరి అనాలేమో సరి చూడగలరు.
      ఆయాసం చదివే వాళ్లకు కదా!

      తొలగించండి
    2. తనయిష్టం తనదట
      వ్రాయకుండ లేరట
      పాఠకుల కర్మమట
      ఓ కూనలమ్మా

      వ్రాసి నీరస పడను
      చదువ ప్రయాసపడను
      కన వినోదం బగును
      ఓ కూనలమ్మా

      తొలగించండి

ఏ మంటారూ?