31, ఆగస్టు 2017, గురువారం

అరెరె అరెరె ఓ కూనలమ్మా!



అన్యులది పొరపాటు
జిలేబిది చొరబాటు
భళి నీకు గ్రహపాటు
ఓ కూనలమ్మా

లోకవిదిత సత్యము
పొరపాట్లవి సహజము
గడబిడ ధూర్తత్వము
ఓ కూనలమ్మా

నిన్ను తా నెరుగునట
అన్యగా మెరుగునట
ఎంత విరుగబాటట
ఓ కూనలమ్మా

అటు పొరబడ్డారని
ఇటు చొరబడ్డారని
లోక మెఱుగదా యని
ఓ కూనలమ్మా

అవి పగటి వేషాలు
మొన్నటి సమోసాలు
జిలేబి తమాషాలు 
ఓ కూనలమ్మా



6 కామెంట్‌లు:


  1. మా కూనలమ్మ మళ్ళీ
    లోకాన పడెను జిలేబులో యమ్మ జిలే
    బీ! కాణాచి గురువులౌ
    బాకా వూదుదురు మేలు పదముల నీకున్ :)

    జిలే బుల్ బుల్ :)

    రిప్లయితొలగించండి

  2. ఓ కూనలమ్మ! కబ్జా
    యై కాణాచిగ జిలేబి యైనా వా య
    మ్మో! గడుసుదాని విగదా !
    వా! కూ సింతై న సిగ్గు వలయున్ గదుటే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంకా బుకాయించకండి జిలేబీ‌గారూ, సూటిగా నిజం చెప్పుకోలేరా మీరు?

      మీరు మీ‌ వరూధిని బ్లాగులో 'కోయంబేడు మార్కెట్లో కూనలమ్మ' అంటూ29వ తారీఖున టపావేసుకొని మీది కాని పేరును మీదవేసుకొని జనాన్ని తప్పుదారి పట్టించాలని చూసింది నిజం కాదా? అన్యగామి గారు మీరే ఈ కూనలమ్మ అనుకొన్నది నిజంగాదా? ఆయన పొరపాటును సవరించి నిజంచెప్పాలని మీరు కించిత్తు ప్రయత్నమూ చేయకుండా దొరికిన అప్పనపుకీర్తికి మురిసి ముక్కలవుతున్నది నిజంకాదా?

      పైగా తింగరి గిందాలొకటి! (మీరు కందం అని వ్రాసినదాంట్లో‌ ప్రాసభంగం గమనించుకోగలరా?‌అసలు సవాలక్షదుర్లక్షణాలలో అదేపాటి లెండి)

      అవును లెండి జిలేబీ గారూ, మీలాంటి వారు రభసచేస్తున్న బ్లాగులోకంలో తానూ కాలుమోపినందుకు కూనలమ్మ కాసింతైనా సిగ్గుపడాలి కదా. తప్పదు మరి.

      తొలగించండి


  3. అప్పనపు కీర్తి వచ్చెను
    కుప్పించగ పద్య మెల్ల కుకుకూ యనుచు
    న్నబ్బోయనగ జనులటన్
    సుబ్బాయమ్మ సొబగులకు చుక్కెదురేదీ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మా జిలేబి పజ్జాల పిచ్చితో తిరిగితోంది. కొంచెం చెప్పి పమ్మించండి
    అయ్యరు.

    రిప్లయితొలగించండి

ఏ మంటారూ?